హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు బతుకమ్మ వేడుకలు.. ఏర్పాట్ల పరిశీలన

HNK: ఫాతిమా జంక్షన్, వడ్డేపల్లి బండ్ వద్ద రేపు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు నేడు ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి దాస్యం పరిశీలించి పలు సూచనలను చేశారు. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో మహిళలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నామని, రేపు నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.