హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ మరింత బలోపేతం చేస్తున్నాం'

మంచిర్యాల జిల్లాలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రబీ, వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని TGNPDCL పంపిణీ నెట్‌వర్క్‌ను ముందస్తుగా బలోపేతం చేస్తున్నామని SE రాజన్న ఆదివారం తెలిపారు. పెరిగే విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం అన్నారు.