ASR: అరకులోయ మండలం లోతేరు గ్రామంలో ఈ నెల 12 నుంచి ప్రారంభం కావాల్సిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం, వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టోర్నమెంట్ ఛైర్మన్ బురిడీ ఆనందరావు ఆదివారం తెలిపారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. 14 పంచాయతీల క్రీడాకారులు గూగుల్ ఫామ్ ద్వారా జట్ల వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వాలీబాల్ టోర్నమెంట్ వాయిదా..!


