బాపట్ల: సూర్యలంక రోడ్డులోని గాయత్రి అపార్ట్‌మెంట్ వద్ద ఎండిపోయిన చెట్టు వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. పెద్ద కొమ్మలు విరిగి పడుతుండటంతో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. రద్దీ మార్గం కావడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఎండు చెట్టును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బాపట్ల రోడ్డులో ఎండు చెట్టుతో ముప్పు


