హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీడీఎస్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి

కోనసీమ: గ్రామీణ తపాలా ఉద్యోగులను 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకువచ్చి, మెరుగైన వేతనాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం అమలాపురం డివిజన్‌కు చెందిన ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఎంపీ గంటి హరీష్ బాలయోగిని కలిసి వినతిపత్రం అందజేశారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అని అన్నారు.