ASR: అరకువేలి మండలంలోని పింపలగూడలో వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 12మంది మహిళలు ఆదివారం నిరసన తెలిపారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.20 వేల చొప్పున మంజూరైనా, నిర్మాణాలు పూర్తయి రోజులు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదని ఉప సర్పంచ్ భగత్ రామ్ విమర్శించారు. ఇసుక, ఇటుకలు, మేస్త్రీ ఖర్చులను మహిళలే భరించారని, బిల్లులు చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బిల్లులు చెల్లించాలని నిరసన


