హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏల్చూరులో దసరా శరన్నవరాత్రులు ప్రారంభం

BPT: సంతమాగులూరు(M) ఏల్చూరులో ఆదివారం దసరా శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తూర్పు బజారులో అమ్మవారు 'బాల త్రిపుర సుందరి' అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. గ్రామంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొందని, దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం ఉంటుందని అన్నారు.