హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

AKP: కోటవురట్ల మండలం కే వెంకటాపురం గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 12,050 నగదు, 10 బైక్లు, కారు, 14 ఫోన్లు సీజ్ చేసినట్లు సీఐ రామకృష్ణ, ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశామన్నారు.