హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీజేపీ అభ్యర్థులు విజయబావుట ఎగరవేయాలి'

E.G: ప్రధాని మోదీ అందిస్తున్న సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ఆదివారం రాజానగరం పరిధిలోని శ్రీరాంపురం, సంపత్‌నగరంలో పార్టీ పతాకాలను ఆవిష్కరించిన ఆయన, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.