హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం జనసేన మేయర్ అభ్యర్థిగా రామకృష్ణ?

కృష్ణా: మచిలీపట్నం మేయర్ కూటమి అభ్యర్థిగా నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ (RK) పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మచిలీపట్నం మేయర్ పదవిని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేనలో మేయర్ పదవి కోసం బండి రామకృష్ణ, కొట్టె వెంకట్రావ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరూ పోటీపడగా, అధిష్ఠానం RK వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.