హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలి'

ASR: కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా గుర్తించి, నెల వేతనాన్ని రూ.10వేలకు పెంచాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పీ.లక్కు డిమాండ్ చేశారు. పాడేరులో 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు ఆదివారం సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.4వేలు చెల్లించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు.