RR: షాద్‌నగర్ పట్టణంలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా స్థాయి ‘గోర్ మేలో మత్రో సభ’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. లంబాడీ భాషను అధికారికంగా గుర్తించాలని, సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
షాద్‌నగర్‌లో సేవాలాల్ సేన జిల్లా స్థాయి సమావేశం


