హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో జిల్లావాసికి మూడు పతకాలు

బాపట్ల జిల్లాకు చెందిన బండి శ్రీనివాసరావు 45వ రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో సత్తా చాటారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జరిగిన పోటీల్లో 50 ఏళ్లు పైబడిన విభాగంలో 5కే పరుగులో స్వర్ణం సాధించారు. 5,000, 10,000 మీటర్ల పరుగుల్లో రెండు రజత పతకాలు గెలుచుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు.