హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

BPT: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా చీరాల పట్టణంలోని కోట్ల బజార్‌నందు వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని అమ్మవారిని కోరుకున్నారు.