హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన

VZM: గజపతినగరంలోని నేత్రాలయ ఐ కేర్ వద్ద ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో జరిగిన శిబిరంలో నేత్ర వైద్య సహాయకులు జాక్షన్ 80 మందికి కంటి పరీక్షలు జరపగా 32 మందిని కేటరాక్ట్ సర్జరీకి ఎంపిక చేశారు. ఇందులో నిర్వాహకురాలు మౌనిక, సహాయ స్ఫూర్తి ప్రతినిధులు సాయికుమార్, రేవంత్ పాల్గొన్నారు.