హైదరాబాద్: 28°C
వ్యాపారం

చూస్తే చాలు.. పేమెంట్ అయిపోతుంది!

ఫోన్ అవసరం లేకుండానే కళ్లద్దాలతో యూపీఐ చెల్లింపులు పూర్తి చేసే స్మార్ట్ కెమెరా గ్లాసెస్‌ను రిలయన్స్ జియో ఆవిష్కరించింది. వీటితో క్రికెట్ లైవ్ కామెంటరీ కూడా వినొచ్చు. వినియోగదార్లు స్మార్ట్ కెమెరా కళ్లద్దాలను ధరించి క్యూఆర్ కోడ్‌ల వైపు చూస్తే.. మనం ఇచ్చే వాయిస్ కమాండ్స్ ద్వారా చెల్లింపులు జరిగిపోతాయి. నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ.5,000 వరకు లావాదేవీలు చేయొచ్చు.