హైదరాబాద్: 28°C
వ్యాపారం

డీమార్ట్‌ లాభం రూ.743 కోట్లు

డీమార్ట్ పేరెంట్ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్స్ 2026 సెప్టెంబరు త్రైమాసికంలో రూ.742.98 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 17.8 శాతం పెరిగి రూ.19,644 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు సైతం 18.3 శాతం పెరిగి రూ.18,632.70 కోట్లుగా నమోదయ్యాయి. సమీక్షా త్రైమాసికంలో కొత్తగా 15 స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 518కి చేరింది.