హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొండలో ట్రాఫిక్ ఆంక్షలు

PPM: పాలకొండ శ్రీ కోట దుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల (అక్టోబర్ 11-20) సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజాం, విజయనగరం, విశాఖ వాహనాలను అన్నవరం జంక్షన్ వద్ద మళ్లించనున్నారు. శ్రీకాకుళం, ఆముదాలవలస భారీ వాహనాలకు ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు పట్టణంలోకి అనుమతి లేదు. వీరఘట్టం జంక్షన్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.