హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు'

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలో గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి వినియోగిస్తున్నట్లు గుర్తించిన వారికి పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ, చట్టపరంగా బైండోవర్‌ చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై శాస్త్రి తెలిపారు. గంజాయి వినియోగం జరుగుతున్నట్లు ప్రాంతాల్లో పగలు, రాత్రి వేళల్లోనూ తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.