హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం

NDL: డోన్ పట్టణంలో పదవీకాలం పూర్తి చేసుకున్న మండల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించి సన్మానించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.