హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉదయం 10 గంటల నుంచి అర్జీలు స్వీకరణ..!

TPT: జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని మండల, రెవెన్యూ, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం గ్రీవెన్స్ డే జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించాలని కోరారు. అర్జీల స్టేటస్ తెలుసుకునేందుకు 1100కు ఫోన్ చేయాలని సూచించారు.