ASR: చింతపల్లి మండలం లంబసింగి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ సునీల్ అన్నారు. ఆదివారం లంబసింగిలో పర్యటించారు. సమాచార శాఖ కమిషనర్ డీటీ నరేంద్ర, ఏపీటీడీసీ లంబసింగి మేనేజర్ అప్పలనాయుడు స్వాగతం పలికారు. తాజంగి జలాశయం, జిప్‌లైన్, బోటింగ్‌లో పాల్గొన్నారు. మైదాన ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నా లంబసింగిలో చల్లని వాతావరణం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'లంబసింగి ప్రకృతి అందాలు రమణీయం'


