హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులని చూసి బావిలో పడ్డ రైతు

KMR: పోలీసుల వాహన తనిఖీలను చూసి పక్కదారి నుంచి వెళ్లే క్రమంలో బైక్‌తో సహా ఓ రైతు బావిలో పడిపోయాడు. ఆదివారం లింగంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోతాయిపల్లికి చెందిన దేవయ్య ద్విచక్ర వాహనంపై లింగంపేటకు వస్తుండగా, పోలీస్ స్టేషన్ సమీపంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పక్కదారి నుండి వెళ్ళే క్రమంలో బావిలో పడిపోయాడు. గమనించిన యువకులు రైతును కాపాడారు.