హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

AKP: కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండల, డివిజన్ కార్యాలయాల్లోనూ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.