హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్

ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ హసన్‌ మహమూద్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఆఫ్ఘన్‌ బ్యాటింగ్‌ పతనాన్ని శాసించిన హసన్‌.. ఒకే ఓవర్లో ముగ్గురిని వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. దీంతో టెస్టుల్లో ఈ ఘనత సాధించిన బంగ్లాదేశ్‌ తొలి పేసర్‌గా నిలిచాడు.