హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs WI: మూడో టీ20 పిచ్ రిపోర్ట్

భారత్, వెస్టిండీస్ మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగే మూడో టీ20లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. మైదానం బౌండరీలు చాలా చిన్నవి కావడంతో సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.