హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దసరా సెలవుల్లో తరగతులపై చర్యలు తీసుకోవాలి'

అన్నమయ్య: రాయచోటిలో దసరా సెలవుల్లోనూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహించడంపై విద్యాశాఖ అధికారులు స్పందించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న డిమాండ్ చేశారు. రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తు పాఠశాలలు నిర్వహిస్తున్నారని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.