కృష్ణా: పామర్రు టీడీపీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతిరెడ్డి శ్రీరామ్ రెడ్డి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పామర్రు టౌన్, కొండిపర్రు గ్రామాలకు చెందిన 10 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకొన్నాయి. చంద్రబాబు నాయకత్వం, కూటమి అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు శ్రీరామ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టీడీపీలో చేరిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి


