KDP: పులివెందులలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో సోమవారం దేవప్రశ్న పూజా మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కేరళకు చెందిన సిద్ధాంతి, దైవజ్ఞులు మహేంద్ర కుమార్ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. సంప్రదాయ జ్యోతిష్య, ఆగమ శాస్త్రాలకు సంబంధించిన ఈ విశిష్ట క్రతువులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో రేపు దేవప్రశ్న పూజా మహోత్సవం


