హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకోవడానికి ఆశావహుల మధ్య పోటీ తీవ్రమైంది. రిజర్వేషన్లు, కూటమిలో సీట్ల కేటాయింపులపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని కలిసి పలువురు నాయకులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు YCPలో కొందరు నాయకులు ఎన్నికల ఖర్చులు, సవాళ్ల కారణంగా పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.