హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్మశాన వాటిక భూమిని కబ్జా చేస్తే సహించేది లేదు'

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం అప్పకొండయ్యగారిపల్లి పరిధిలోని గంగనపల్లి స్మశాన వాటిక భూమిని కాపాడాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని, పట్టా రద్దు చేయాలని కోరారు. గ్రామ ప్రజల హక్కుల కోసం పోరాడతామని తెలిపారు.