హైదరాబాద్: 28°C
వ్యాపారం

అయిదేళ్లలో రూ.16.67 లక్షల కోట్లు

భారత్‌లో డేటా కేంద్రాల రంగం వేగంగా విస్తరిస్తోంది. 2021 నుంచి 2026 ప్రథమార్థం వరకు, భారత డేటా సెంటర్ రంగానికి సుమారు రూ.16.67లక్షల కోట్లు పెట్టుబడి హామీలు లభించినట్లు స్థిరాస్తి సేవల సంస్థ CBRE తన నివేదికలో పేర్కొంది. ఈ పెట్టుబడుల్లో హైపర్‌స్కేల్, కో-లొకేషన్ ప్రాజెక్టుల వాటా 62 శాతంగా ఉంది. మొత్తం పెట్టుబడి హామీల్లో 15 శాతానికి పైగా ఏఐకి సంబంధించినవేనని పేర్కొంది.