హైదరాబాద్: 28°C
వ్యాపారం

గ్రీన్ కార్డు ప్రోగ్రామ్ సస్పెన్షన్‌పై స్పందించిన ఇన్ఫోసిస్

యూఎస్ పర్మ్ కార్యక్రమం నుంచి అమెరికా తమను సస్పెండ్ చేయడంపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది. ఈ నిర్ణయం తమ కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపదని భావిస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలో సాంకేతికతకు, ఆవిష్కరణలకు, స్థానిక ఉద్యోగాల నియామకాలకే కంపెనీ పెట్టుబడులు పెడుతోందని చెప్పింది. అమెరికాలో వర్తించే నిబంధనలకు, చట్టాలన్నింటికీ కట్టుబడి ఉన్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది.