హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన రైతులకు శిక్షణ

ASR: జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఆదేశాల మేరకు స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో చింతపల్లి మండలం బలపం పంచాయతీ గుంజివీధి గ్రామంలో గిరిజన రైతులకు పసుపు నాణ్యత మెరుగుదలపై శిక్షణ నిర్వహించారు. స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బి. కళ్యాణి నాణ్యమైన పసుపు ఉత్పత్తి, కోత అనంతర నిర్వహణ, ప్రాసెసింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.