E.G: దసరా పండుగను పురస్కరించుకుని నగరంలోని 1, 2, 11వ డివిజన్లలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. నిర్వాహకులు, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


