హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేచర్ల క్వారీలో పెద్ద పులి సంచారం.. డ్రోన్ ద్వారా ఆచూకీ

E.G: పులి కొవ్వూరు రూరల్ పరిధిలోని దేచెర్ల క్వారీలో తలదాచుకుంది. రాజమండ్రి రేంజ్ అటవీ అధికారులు, పుణే నుంచి వచ్చిన రెస్క్యూ బృందం పులిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముందస్తు భద్రతలో భాగంగా పోలీసులు క్వారీ కార్మికులు, స్థానిక ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. విశ్రాంతి తీసుకుంటున్న పులి కదలికలను డ్రోన్ల ద్వారా నిరంతరం పరిశీలిస్తున్నారు.