హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంపలగూడెంలో శరన్నవరాత్రి పూజలు

NTR: గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గంపలగూడెం ఎస్సై జి.అనిల్ తన సతీమణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమాజంలో శాంతిభద్రతలు నెలకొనాలని, పోలీస్ శాఖ సమర్థవంతంగా సేవలందించాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.