హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ సునీల్ షొరాణ్ పోలీసు అధికారులను ఆదివారం ఆదేశించారు. రహ్‌వీర్ పథకంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని SP సూచించారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు.