ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల బీచ్ వద్ద సముద్రంలో తీవ్ర ప్రవాహాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత దృష్ట్యా అక్టోబరు 11 నుంచి 15వ తేదీ వరకు బీచ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఎస్.కొండ తహసీల్దార్ తెలిపారు. ఈ సమయంలో బీచ్‌లోకి ప్రవేశించడం, సముద్రంలో స్నానాలు చేయడం నిషేధించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సముద్ర ప్రవాహాల ఉద్ధృతి.. బీచ్‌కు తాళం


