హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెర్లాంలో 'చదవడం మాకిష్టం' కార్యక్రమం

VZM: తెర్లాం శాఖా గ్రంథాలయంలో ఆదివారం గ్రంథాలయ అధికారి సీహెచ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 'చదవడం మాకిష్టం'కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పద్యాలు, గద్యాల పోటీలు నిర్వహించారు. అనంతరం పంచతంత్రం, సరదా కథలు, నవరత్నాల కథలు, పొడుపు కథలు, కుందేలు చెప్పిన కథలు తదితర పుస్తకాలను విద్యార్థులతో చదివించి, కథలు చెప్పించారు.