హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళల భద్రతకు అందరూ సహకరించాలి'

ASR: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా కొయ్యూరులో ఆదివారం ఆటో డ్రైవర్లకు సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ అవగాహన కల్పించారు. రహదారి భద్రతా నియమాలు పాటించాలని, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళల భద్రత అందరి బాధ్యతని సీఐ, ఎస్సైలు అన్నారు.