హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

NTR: ఇంద్రకీలాద్రిపై ఆదివారం దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కాగా బాలాత్రిపురసుందరిగా కనకదుర్గమ్మ దర్శనానికి ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పోటెత్తారు. మూడు క్యూలైన్లలో ఉచిత దర్శనం అని ప్రకటించినా వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చిందని భక్తులు ఆరోపించారు. సామాన్యులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ ఉత్సవాలు 20 వరకు సాగుతాయన్నారు.