WG: తణుకు నుంచి చర్లపల్లి వెళ్తున్న రైలులో ప్రయాణిస్తూ ఆకివీడు-కైకలూరు మధ్య జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి ఛాతిపై 'జ్వాల' అనే పచ్చబొట్టు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. జూన్ 6న ఉదయం 6.30 గంటలకు టికెట్ తీసుకున్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలిసినవారు భీమవరం రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం (9494340096)కు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి


