హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

సత్యసాయి: జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ అర్జీలు స్వీకరిస్తామన్నారు. ప్రజలు meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు సమర్పించవచ్చని, సమాచారం కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.