KRNL: కిడ్స్ వరల్డ్ ఆవరణలో ఇవాళ తైక్వాండో క్రీడాకారుల గ్రేడింగ్ టెస్ట్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంతో పాటు చదువుల్లోనూ రాణించవచ్చన్నారు. తైక్వాండోతో ఏకాగ్రత, దేహదారుఢ్యం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్‌తో ఊబకాయాన్ని అధిగమించవచ్చని, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ సామర్థ్యం పెరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'తైక్వాండోతో ఆరోగ్యం, క్రమశిక్షణ'


