హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం

సత్యసాయి​: కదిరి నియోజకవర్గం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీలో డా. బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 300 మంది రోగులకు, వారి బంధువులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఖతీబ్ షబ్బీర్, నర్సిరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.