హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీఐ

AKP: నాతవరం మండలం జిల్లేడుపూడి, చెర్లోపాలెం, డి.ఎర్రవరం గ్రామాల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆదివారం రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్సై తారకేశ్వరరావుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ ప్రజలతో ముఖాముఖి అయ్యారు. రాబోయే స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించే విధంగా రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.