హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయపడిన ఫ్లెమింగోకు చికిత్స..!

WG: ఆకివీడు మండలం చినకాపవరం గ్రామ పరిధిలో ఫ్లెమింగో జాతికి చెందిన పక్షి ఆదివారం గాయాల బారిన పడింది. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫారెస్ట్ సిబ్బంది ఇంఛార్జ్ సెక్షన్ ఆఫీసర్ రత్నరాజు ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది ఫ్లెమింగో జాతి పక్షిని ఆకివీడులోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు.