హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలవరం ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి'

ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శాసనసభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. బుట్టాయగూడెం మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అభివృద్ధి ముసుగులో ఇసుక, మట్టి మాఫియా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు, మిగులు భూముల బినామీ రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు.