సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లు, పాత నేరస్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్


